ఎవరూ లేరే నీ కొరకు
ఎవరికి వారే కడవరకు
కోరకు ఎవ్వరి రాకని
ఏవ్వరివో నువ్వారికి
చూపించావో అతిగా ప్రేమని
దిగజారినట్టే నువ్విక వారికి
నువ్వు, చేతులు చాచి పడిగాపులు
నీకై, ఎంగిలి చేతుల విదిలింపులు
అవసరమా అనురాగపు భిక్షాటన
అవసరమా దయతలచిన ఆప్యాయత.
ఎవరూ లేరే నీ కొరకు
ఎవరికి వారే కడవరకు
సురేష్ సారిక
ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
1
+1
+1
+1