మనిషికి
కోరికలు పెరిగే కొద్దీ
చెయ్యాల్సిన కష్టం పెరుగుతుంది
కష్టం పెరిగే కొద్దీ
అనుభవించాల్సిన బాధ పెరుగుతుంది
బాధ పెరిగే కొద్దీ
జీవితం మీద విరక్తి కలుగుతుంది
విరక్తి కలిగినప్పుడు
పుట్టిన కోరికలు ఒక్కొక్కటిగా చస్తూ ఉంటాయి.
పిచ్చోడా
ఎందుకురా ఇంత తాపత్రయం
అందరిని పక్కకు తోసుకుంటు
ముక్కుతూ, మూలుగుతూ దేకుడెందుకు
ఎందెందో వుందని ఆనందం
వెతుకులాటెందుకు
పరుగులాటెందుకు
పొడుబారిన గొంతుకకి
తేమ తగిలితే దొరకదా
ఎండకి చిటపట లాడుతున్న తోలుకి
చల్లగాలి తాకితే దొరకదా
అలిసిపోయిన దేహాన్ని
కటిక నేలపైన పడేసినా దొరకదా
జారుతున్న కన్నీటిని తుడిచేందుకు
ఓ చేయి ముందుకొస్తే దొరకదా
బారమౌతున్న అబద్ధాని
కక్కినప్పుడు దొరకదా
చిన్న చిన్న వాటిలో ఇంతింత ఆనందమెట్టుకొని
మేడలు, ఓడలంటూ ఎందుకు నీ వెంపర్లాట.
సంతృప్తి లేకట స్వర్గమైనను నరకమట
ఆగు, ఆగు ఒక్క క్షణమాగి ఆలోచించు
సురేష్ సారిక