సమాజం ఎదగమంటుంది
ప్రతిచోట విలువ కడుతుంది
ఐనా అడుగులే వేస్తున్నా..
కోరికల గుంపే ఒకటుంది
అవసరం ఎదురౌతూనేవుంది
ఐనా అడుగులే వేస్తున్నా..
వొణుకులేని చేతులున్నాయి
బలమైన కాళ్ళూ వున్నాయి
ఐనా అడుగులే వేస్తున్నా..
ఆకాశమే హద్దుగా వుంది
ప్రకృతి సాయపడతానంది
ఐనా అడుగులే వేస్తున్నా..
ఎందుకు..?
యావలేకనో, సత్తువలేకనో
ఇంకా అడుగులే వేస్తున్నా..
నేరం కాదనుకుంటా
ఈ పరుగులాటలో
పాలు పంచుకోకపోవడం..!
నేరం కాదనుకుంటా
ఈ మందనుండి
విడిపడి బ్రతకడం..!
నేరం కాదనుకుంటా
నెమ్మదిగా బ్రతకడం..!
సురేష్ సారిక
ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
+1
+1
+1