పుట్టీ పుట్టగానే, చెత్త కుండీలో విసిరింది నా తల్లి

పురిటి నొప్పులు గుర్తొచ్చి
నాపై కోపోమొచ్చిందొ ఏమో…

నా కడుపు నింపలేనని
కష్టాల కడిలి ఇదోద్దని
మోక్షం ఇవ్వబోయినదేమో….

పుట్టీ పుట్టగానే, చెత్త కుండీలో విసిరింది నా తల్లి

ఎర్రటి చీమలు మెత్తటి కండను చీలుస్తుంటే
గుక్కపెట్టి ఏడ్చా, అటుగా వచ్చినవారెవరో
దేవరు, అనాధ సరణపు అరుగుపై వదిలారు.

ఆకలి తప్ప మరొకటి ఎరుగని పసివాడిని
ఏడ్చినప్పుడల్లా నీళ్ల పాలపీకే నోటికందేది.

ఒక్కోసారి..
ఆకలికి ఓర్వలేక నోటికందినది నెమరు వేసేవాడిని
అక్కర ఎవరూ లేని నాడు
ఏడ్చి ఏడ్చి అలసి, సొలసి రెప్ప వాల్చే వాడిని.

పుట్టుమచ్చలల్లే…
కన్నీటి అట్టలట్టె లేత బుగ్గలపై

అభాగ్యుడను గుక్కెడు తల్లి పాలు ఎరుగను
పొద్దు ఎరుగను, ఏ పాప మెరుగను
ఇంత కష్టమెందుకు మోపినాడా దేవుడు నాపై

కష్టం మరిచి గట్టిగ నవ్వితే
తట్టుకోలేని లోకం
ఎప్పుడూ ఎడిపిస్తూనే వుండేది.

ఊహ తెలిసిన నాటికి
అమ్మ లేదని, నాన్న లేడని
నా వారు అనువారు లేరని
చెప్పుకునేందుకూ… ఎవరూ లేక
నాలో నేను కుమిలిపోయా..

అలగడం నేనెరుగను
తల్లితండ్రుల మారం నేనెరుగను

గోరు ముద్దులు నేనెరుగను
గసురుతూ కుక్కిన మెతుకులే అన్నీ

ఆడిస్తూ పోసిన లాల నేనెరుగను
చీదరిస్తూ కుమ్మరించిన చన్నీళ్లే

చెప్పుకుంటూ పోతే ఓ పురాణమిది

ఈ నాటికి
ప్రాణమొక్కటే నే పొందిన బహుమతి

నీరసించిన నా జీవితానికి
రేపటిపై ఆశే బలం.

సురేష్ సారిక

ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
0
+1
0
+1
0
+1
0

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don`t copy text!