ఎందుకు
ఎందుకు మొహమాటపు బతుకు బాట
ఎందుకు ముసుగుతో అబద్ధపు నవ్వులాట
ఎందుకు ఆనందానికై బయట వెతుకులాట
ఎందుకు ఆనందానికై ఒకరిపై భారమేయుట
ఎందుకు అశాంతిని కూడేసుకుంటూ వాదులాట
ఎందుకు చీకటి మనుషులతో ముట్టుకునే ఆట
నీ పైబడిన చెత్తని అప్పుడే తుడుచుకు సాగాలి
ఎప్పటికప్పుడు పట్టిన కంపుని కడుక్కుపోవాలి
అతుకుల బతుకులొద్దు
వేదనల పయనమొద్దు
నచ్చినట్లుగా నడువు
ఎవరు సంక్కెలెయ్యరు నీకు
ఆనందాన్ని కొల్లగొట్టు
ఎవరు వివరణ కోరరు నిన్ను
నీ బతుకు నీకు తెలుసు
నీ పలుకు నీకు తెలుసు
నిక్కచ్చిగా బతుకు చచ్చేదాకా
సంతోషాన్ని పంచి చావు పుట్టినట్టుగా
సురేష్ సారిక
ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
+1
+1
+1