నవ్వుతున్న పసిరూపం
ఇన్నాళ్లుగా నా
కనులకు బందమై వుంది.
లేత మనసు గసిరిన
తేనె జల్లు ఇంకా
నన్ను అంటుకునే వుంది.
వీడ్కోలు నాడు
చెంపగిల్లిన పువ్వు
పరిమళం అలానే వుంది.
ఊహ తెలియని నాడది ఇష్టమేమో
ప్రేమైనది నేడది ప్రాణమనేంతగా
ఎక్కడున్నావో కానరాక కుమిలిపోయా నాడు
ఇక్కడే వున్నా అందుకోలేక ఆగివున్నా నేడు
తట్టుకోలేక తల్లడిల్లుతున్నా
ఒడ్డున పడ్డ చేప పిల్లలా
తన్నుకులాడుతున్నా..
అదిమి పెట్టుకున్నా గుండె
నాడో నేడో బద్దలౌతానంట్టుంది..
బిక్కపట్టుకున్న బాధ
ఉబికి పడతుంది ..
సరదా ఆటనుకుంట గుడిలో వాడికి
సలసల మండుతున్నది ఈ నాడికి
వరమిస్తాడంటే ఆ దేవుడింట
నీకై ఎన్నిసార్లైనా మోకరిల్లన్నా…
మరు జన్మలో నిన్ను తోడిస్తాడంటే
ఈనాడే ఈ జన్మను బలి ఇవ్వన్నా ..
సురేష్ సారిక
ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
+1
+1
+1