బూడిదంటిందని నిప్పుని కడుగుతావా? పువ్వు వడిలిందని మొక్కను తుంచుతావా? గ్రహణమంటిందని సూర్యుణ్ణి వెలివేస్తావా? తేనెటీగల ఎంగిలి అని తేనెను పారబోస్తావా? వదిలి పోయిందని ఊపిరిపై నువ్వు అలగ లేదుగా! వాలిపోతుందని కను రెప్పను తెరవకుండ ఉండలేదుగా! మరి ఓటమి ఎదురైందని జీవితాన్ని ఎందుకు ఆపుతావు. నీ అడుగులే నిన్ను ముందుకు నడిపేది. నీ చేతలే నీ జీవితాన్ని నిర్మించేది. ఎవడో వెక్కిరించాడని ఎక్కెక్కి ఏడవకు పోరాడి గెలిచి వాడి నోటే జేజేలు విను నీకు నిజమైన ఓటమి ఒడిపోయానని నువ్వు ఒప్పుకున్నప్పుడే. నిలబడి ఆట ఆడుతున్నంత సేపు నువ్వు విజయానికి ఒక్క అడుగు దూరమే.. గుండెను బిగించి, గట్టిగ ఊపిరి పీల్చి ఆ ఒక్క అడుగు ముందుకు వేసావో గెలుపు కూడా నీ ముందు తల దించుకు నిలబడుతుంది. గుర్తు పెట్టుకో... ప్రాణం పోతుందనిపిస్తే తప్ప నీ ప్రయత్నం ఆపకు. సురేష్ సారిక
ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
+1
+1
+1