అలుపు దేహానికా లేక కనురెప్పకా ?
ఓటమి నాకా లేక నా ప్రయత్నానికా ?
ఊహాలెక్కువై బుద్ధి అలిసిందా
పరుగెక్కువై ఒళ్ళు చతికల పడిందా
అందాలు చూడలేని కన్ను చిమ్మ చీకటంటుంది
ముందడుగు వెయ్యలేని కాలు దారి లేదంటుంది
ఎందుకీ సందిగ్ధం ?
నను ఆపుతున్నదేమిటి?
నాలో పేరుకుపోతున్న కోరికలా
ఒక్కసారిగా వచ్చిపడే వందల ఆలోచనలా
నిజమనే అబద్ధాని తెలుసుకోవాలనే తపనా,
లేక అనంతానికి నాకు మద్య జరుగుతున్న సంఘర్షణా
ఏమో.. ఇంతా తెలిసి,
ఇంకా ఏవో మసక పొరలు నా గమ్యంపై
కాసేపు ఆగిపోవాలని
కాసేపు వెతుకులాడాలని
కనీసం ఊపిరి ఆగే లోపు ఐనా
ఎదో ఒక ఆధారం దొరుకుతుందో లేదో ?
సురేష్ సారిక
ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
1
+1
+1
+1