ఎందుకంత నిర్లక్ష్యం
ఎందుకంత బాధ్యతారాహిత్యం
నీ పని నువ్వు చేసేందుకు
నీ కాల్లొత్తాలా.?
నీ జేబులు నింపాలా.?
నీ ముందు
సాగిలపడి దేవులాడాలా.?
పేదవాడు నీకు మరీ చులకనా.?
సున్నితంగా అడిగితే చీదరించి తోలుతావా.?
రేపని, మాపని కాళ్లు అరిగేలా తిప్పుతావా.?
ఓ హక్కుగా నిన్నడిగితే,
నీ సొమ్మేదో ఇస్తున్నట్టుగా
మసులుతావా..?
ఓ ప్రభుత్వ ఉద్యోగి
తెలుసా..?
నీ నిర్లక్ష్యపు సమాధానం
ఎన్ని గుండెలు పగిల్చిందో
తెలుసా..?
నువ్వు సమయానికి స్పందించక
ఎన్ని కట్టెలు కాలినవో ..!
ఎంత నేల పూడినదో ..!
నీపై అధికారులు
తప్పతాగి పండినారానుకుంటా ..
ఎంతమంది కేకలేసినా
వినపడనట్టుగా చెవులలో
అరిగినది నింపుకున్నారనుకుంటా ..
ప్రభుత్వ ఉద్యోగమంటే ..
పని చెయ్యక పందులులా తినడమా ..?
పని చెయ్యమంటే ..
రోడ్డెక్కి అరిగేదాకా అరవడమా ..?
బాధ్యత లేని వాడిని
బెత్తం పట్టుకునే నడిపించాలి
పని మానే వాడిని
పలుపు తాడు కట్టి లాగాలి
గుర్తుందా నీ విధి నీకు.?
లేదా, గుర్తుచేయ్యనా మరొక్కసారి.
ముఖ్యంగా .. ..
సాటి మనిషితో ఎలా మెలగాలో
నిన్ను కన్నోరిని అడిగి తెలుసుకో
నువ్వూ మనిషివేనని గుర్తు చేసుకో
నెత్తిమీద కొమ్ములు రాకుండా చూసుకో
ఇకనైనా .. ..
మార్చుకో నీ నడత.
సురేష్ సారిక