ఎందుకు కొడకా
తొందర పాటు.
కీళ్ళేమన్నా అరిగాయా
నిలబడలేనని ఒరిగావు
గూల్లెమన్నా జారాయా
బతుకు భారమని కూలావు
చూపేమన్నా మసకబారిందా
తెరవలేనని మూసేసావు
చల్లగాలి నిన్ను ఒణికించిందా
కట్టెలపై వేడి కాచుకుంటున్నావు
ఎందుకు కొడకా
తొందర పాటు
ఏమిడిచి పోయావు నేలమ్మకి
ఏమట్టుకెళ్లావు ఆ నింగికి
ఎట్టాగ ఓదార్చేది మీ అమ్మని
నేనెట్టా నిలిచేది ముసులోడిని
మా బోసి నవ్వులు చూడక పోతివి
మమ్మెత్తి ఊరంతా ఉరేగించక పోతివి
ఎందుకు కొడకా
తొందర పాటు
సురేష్ సారిక
ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
+1
+1
+1